తెలంగాణ లో కానిస్టేబుల్ పోస్టులకు ప్రకటన విడుదల ప్రాథమిక రాత పరీక్ష ఏప్రిల్‌ 24

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌, ఏఆర్‌, ఎస్‌.ఎ.ఆర్‌., టి.ఎస్‌.ఎస్‌.పి., కమ్యూనికేషన్స్‌, పి.టి.ఒ., ఎస్పీఎఫ్‌), స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్ల ప్రాథమిక రాత పరీక్షలను మాత్రం యథావిధిగా ఏప్రిల్‌ 17వ తేదీన(ఆదివారం) నిర్వహించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష ఏప్రిల్‌ 24వ తేదీన జరుగనున్నాయి.

వాస్తవానికి కానిస్టేబుల్‌ (సివిల్‌, ఏఆర్‌, ఎస్‌.ఎ.ఆర్‌., టి.ఎస్‌.ఎస్‌.పి.), ఎస్పీఎఫ్‌, ఫైర్‌మెన్‌ పోస్టులకు ఏప్రిల్‌ 3వ తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ అదేరోజు రైల్వే నియామక మండలి కూడా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. రెండు పరీక్షలూ ఒకేరోజు ఉండటంతో తాము ఒకే పరీక్ష రాయగలమని.. కానిస్టేబుల్‌ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 3వ తేదీన నిర్వహించాల్సిన కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్‌ 24వ తేది ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
Source: http://www.bhaarattoday.com/news/education/exam-for-constable-posts-in-telangana/8741.html

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment