ఇండియన్ నేవీలో జాబ్స్ డిగ్రీ, బీఈ/బీటెక్ సోర్ట్స్ కోచింగ్‌లో డిప్లొమా, ఎమ్మెస్సీ ఇన్ స్పోర్ట్స్ (కో చింగ్)

ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్ఎస్.సీ) ఆఫీసర్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ (స్పోర్ట్స్) జనవరి 2017 కోర్సు నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు:
కేరళలోని ఎజిమల ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో ఈ కోర్సు జనవరి 2017న ప్రారంభమవుతుంది. ఈ పోస్టులు ఎగ్జిక్యూ టివ్ బ్రాంచీ (స్పోర్ట్స్‌లో ఉన్నాయి. 

వయస్సు 22 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. (1990, జనవరి 2 నుంచి 1995, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి) యాచింగ్, సర్ఫింగ్ క్రీడాకారులకు 21 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. (1992 జనవరి 2 నుంచి 1996, జనవరి 1 మధ్య ఉండాలి) 

విద్యార్థతలు:రెగ్యులర్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్ సోర్ట్స్ కోచింగ్‌లో డిప్లొమా, ఎమ్మెస్సీ ఇన్ స్పోర్ట్స్ (కో చింగ్) ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. క్రీడాంశాల 

అర్హతలు; సీనియర్ లెవల్లో జాతీయ చాంపియన్‌షిప్/ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి. విభాగాలు అథ్లెటిక్స్ క్రాస్‌కంట్రీ టైడలాన్, టెన్నిస్, స్క్వాష్ ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, క్రికెట్, డైవింగ్, వాటర్ పోలో, కబడ్డీ, బాక్సింగ్ యాచింగ్/విండ్సర్ఫింగ్ క్రీడాకారులకు కింది ఏదైనా ఒక అర్హత ఉండాలి. వైఏఐ నిర్వహించిన సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒలిం పిక్క్లాసెస్లో ఐదోస్థానం. లేదా ఏషియన్ గేమ్స్/ఐఎస్ఏఎఫ్ యూత్ సెయిలింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో మెడల్సాధించిన వారు లేదా ఐఎ స్ఏఎఫ్ యూత్ సెయిలింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో టాప్ 50
శాతంలో ఉన్నవారు. 

శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు, దానికి తగ్గ బరువు ఉండాలి. 

షార్ట్ సర్వీస్ కమిషన్: దీని కింద పదేండ్ల సర్వీస్ ఉంటుంది. దీన్ని మరో నాలుగేండ్ల పొడిగించే అవకాశం ఉంది.

ఎంపిక:షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్ధులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీనిలో క్వాలిఫై అయిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు భోపాల్, బెంగళూరు, కోయంబతూరు, వైజాగ్‌లో మెడికల్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 

యాచింగ్/విండ్ సర్ఫింగ్ క్రీడాకారులకు - నేవల్ స్టేషన్స్‌లో సెయిలింగ్ సెలక్షన్ ట్రయల్స్‌ను నిర్వహిస్తారు. అనంతరం ప్రిలిమినరీ ఇంటర్వ్యూ వీటిలో ఎంపికైనవారికి ఎస్ఎస్బీ మెడికల్ టెస్ట్‌లను నిర్వహించి ఎంపిక చేస్తుంది. 

శిక్షణ:జనవరి 2017 నుంచి ప్రారంభమవుతుంది. కేవలం అవివాహిత అభ్యర్థులు మాత్రమే శిక్షణకు అర్హులు. శిక్షణ పూర్తిచేస్తుకొన్న అభ్యర్థులను సబ్ లెఫ్ట్‌నెంట్ హోదాలో నియమిస్తారు. 

దరఖాస్తు; ఆన్లైన్లో, 

చివరితేదీ:ఏప్రిల్ 18 ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ఆకాపీ ప్రింట్‌ను ఏప్రిల్ 28లోగా కింది చిరునామాకు పంపాలి. 

Post Box No. 04, RK Puram Main PO, New Delhi- 110-066 www.joinindiannavy.gov.in

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment