వికలాంగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

జిల్లాలో వికలాంగులకు రిజర్వ్ చేయబడిన ఖాళీల భర్తీకి జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ -4, క్లాస్-4 సర్వీస్ల్లోని 11 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వికలాంగుల సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి పూర్తిగా స్థానిక కోటాకు చెందినవని, ఈ అవకాశాన్ని జిల్లాలోని వికలాంగులు సద్వి నియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు నాంపల్లి ఎగ్జిబిషన్గ్రౌండ్స్లో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

హాస్టల్ వెల్ఫేర్ అధికారి - గ్రేడ్-2 - 1
అర్హతలు: డిగ్రీతో పాటు బీఈడీ పూర్తిచేసి ఉండాలి 
రిజర్వేషన్: జనరల్ 

జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ 1 
అర్హతలు: డిగ్రీతో పాటు టైప్రైటింగ్
రిజర్వేషన్: మహిళ

ల్యాబ్ టెక్నీషియన్ 1 
అర్హతలు: డిగ్రీలోపాటు ల్యాబ్టైక్నీషన్ కోర్సు 
రిజర్వేషన్: జనరల్ 

ల్యాబ్ అటెండెంట్ 2 
అర్హతలు: 1 పోస్టుకు ఎస్సెస్సీతోపాటు ఏడాది వ్యవధి గల మహిళ ల్యాబ్ అటెండెంట్ సర్టిఫికెట్ కోు మరో పోస్టు ఎస్సెస్సీతో పాటు ఐటీఐ 

ఎం.ఎన్.వో - 1 
అర్హతలు: 8వ తరగతి, ప్రాథమిక వైద్యంలో సర్టిఫికెట్ 
రిజర్వేషన్: మహిళ

అటెండర్- 1 
అర్హతలు:7వ తరగతి
రిజర్వేషన్: మహిళ


అటెండర్- 1 
అర్హతలు:7వ తరగతి
రిజర్వేషన్: జనరల్ 

వాచ్మెన్ అండ్ కుక్-1 
అర్హతలు: 5వ తరగతి 
రిజర్వేషన్: జనరల్ 

హెల్పర్, ఆయా- 2 
అర్హతలు: రాయడం, చదవడం వచ్చినవారు 
రిజర్వేషన్: మహిళ

No comments:

Post a Comment