బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగ - ఉగాది పండుగ చరిత్ర

చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న  రోజును  ఉగాది పండుగగా  పరిగణిస్తారు.

ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేస్తారు.  తిలకధారణ, నూతన వస్త్రాల ధారణ తరువాత భగవంతుడిని పూజించాలి. పూజ అయిన తరువాత పెద్దల దీవెనలను పొందడం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయి.

ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, వేప పువ్వు చేదు, మామిడి పిందె వగరు, కొత్త బెల్లం తీపి కొత్త చింతపండు పులుపు, పచ్చి మిర్చికారం, ఉప్పు. ఉదయాన్ని  ముందుగా  ఈ పచ్చడి  తినడము తెలుగు వారి సామ్ప్రదాయమ్. హోలీ పండుగకు కూడా మామిడి పిందెలు తినాలి అని  ఉండడము మనము గమనిస్తే ఆ కాలములో వచ్చే కాయలను పండులను తినడము ఆరోగ్యానికి మంచిది అని మనకు పెద్దలు చెప్పినట్టు గ్రహించవచ్చు.

ఉగాది పండుగ దినాన భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని ఆద్యాత్మిక గురువులు అంటున్నారు. శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. శ్రీ మద్రామాయణ పారాయణ శ్రీ రామనవమి వరకు చెయ్యచ్చు అని కూడా మనము అన్వయిన్చుకోవచ్చును

 బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను తెలుగు వారు  జరుపుకుంటారు.


Source : http://guide-india.blogspot.in/

No comments:

Post a Comment