54,953 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ - ఆగస్టు 17 to సెప్టెంబరు 17

కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేయనున్న 54,953 కానిస్టేబుల్‌ కొలువులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించినట్టు సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ హరిహోం ఖరే మీడియాకు తెలిపారు. ఆగస్టు 17న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 17తో ముగియనున్నట్టు ఖరె స్పష్టంచేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలోని సీఆర్పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఖరె తెలిపారు. నేరుగా సంప్రదించడం కుదరని అభ్యర్థులు 040-29809876 నంబర్‌‌కు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అని ఖరే అన్నారు.

ఆసక్తి ఉన్న 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు www.ssc.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని స్టాఫ్ సెలక్షన్ కమిటీ సూచించింది. కేంద్ర పారామిలిటరీ బలగాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు ఇదో చక్కటి అవకాశం.

APPLY LINK : https://ssc.nic.in/Portal/Apply

Source: zeenews.india.com

No comments:

Post a Comment