తెలంగాణ‌లో 9,355 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కొత్త జిల్లాల్లో వారు స్థానిక అభ్యర్థులై ఉండాలి.

వ‌య‌సు: 18-39 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా.

ప‌రీక్షా విధానం: రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో మూడు గంటల వ్యవధిలో రెండు పేపర్లుగా ఉంటుంది. మొదటి పేపరు 150 మార్కులతో జనరల్‌ నాలెడ్జి, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీకి చెంది ఉంటుంది. రెండో పేపరు మరో 150 మార్కులతో తెలంగాణ పంచాయతీరాజ్‌ నూతన చట్టానికి, పంచాయతీరాజ్‌ సంస్థలకు, స్థానిక ప్రభుత్వాలు, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, ఆర్థికం, ప్రభుత్వ పథకాలకు చెంది ఉంటుంది. పశ్నపత్రాలు జంబ్లింగ్‌ పద్ధతిలో ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి ఒక్కో మార్కు చొప్పున ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4 మార్కుల చొప్పున కోత ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.400.

ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 11.09.2018

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 12.09.2018

Link : https://tspri.cgg.gov.in/

No comments:

Post a Comment